పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి గ్లిమ్స్ వీడియో..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమా షూటింగ్స్ తో తెగ బిజీ అయిపోయాడు. మొన్నటి వరకు కేవలం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లోనే పాల్గొన్న పవన్ ఇప్పుడు మరో మూడు సినిమాలను సెట్స్ మీద తీసుకెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఎలక్షన్ టైం లో వీలైనన్ని సినిమాలను పూర్తి చేయాలని పవన్ పక్కాగా తన డేట్స్ ని ప్లాన్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

వీరి కాంబోలో సుమారు 11 ఏళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసింది. మళ్లీ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత వీరి కాంబో సెట్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనా నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోని మే 11న విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఆరోజు గబ్బర్ సింగ్ మూవీ 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ గ్లిమ్స్ ని మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు.

అయితే ఈ వార్తలో ఎంత నిజమందో తెలియాలంటే మూవీ టీం నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో పవన్ కి జోడిగా శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీత మందిస్తున్నారు.ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా కూడా చేస్తున్నాడు పవన్. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.ఇక అటు తన మేనల్లుడు సాయి ధరంతేజ్తో కలిసి నటిస్తున్న వినోదయ సీతం రీమేక్ కూడా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. తమిళ విలక్షణనుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు సాహో డైరెక్టర్ సుజిత్ తో OG మూవీ షూటింగ్లో కూడా ఇటీవల జాయిన్ అయ్యాడు పవన్ కళ్యాణ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: