సమంత ను ఇబ్బంది పెడ్తున్న అలాంటి కామెంట్స్.....!!

murali krishna
అక్కినేని నాగ చైతన్య మరియు సమంత జోడి ఎంతో మందికి ఇష్టం. అలాంటి ఇష్టమైన జోడి విడిపోయిన సమయంలో ఎంతో మంది బాధపడ్డారు.
కలిసి ఉంటే బాగుండేది కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వారిద్దరు విడిపోయారు. వారు ఇద్దరు విడిపోయిన తర్వాత వారి యొక్క అభిమానులు కూడా విడిపోయారు. సమంత అభిమానులు నాగ చైతన్యను..నాగ చైతన్య అభిమానులు సమంత ను సోషల్ మీడియాలో సమయం సందర్భం లేకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ మధ్య థాంక్యూ అనే సినిమా ను నాగచైతన్య చేసి ఫెయిల్యూర్ ని చవి చూశాడు. ఆ సమయంలో సమంత ఫ్యాన్స్ కొందరు సినిమా ను అత్యంత దారుణంగా ట్రోల్స్ చేయడం జరిగింది. దాంతో నాగచైతన్య అభిమానులు కూడా ఎప్పుడు సమంత దొరుకుతుందా అని ఎదురు చూసి ఆమె సినిమాలు విడుదల అయిన సమయంలో ట్రోల్స్ చేయడం జరిగింది.
ఇటీవల సమంత నటించిన శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. దాంతో నా చైతన్య అభిమానులు ఇదే అదునుగా తీవ్రమైన ట్రోల్స్ చేస్తూ ఆమెను మరియు ఆమె ఫ్యాన్స్ ని ఒక ఆట ఆడేసుకున్నారు. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఒక హిందీ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం లండన్ లో సమంత ఉన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడి మీడియాతో సమంత మాట్లాడుతూ ఇంగ్లీష్ ని కాస్త యాస గా మాట్లాడటం జరిగింది. దాంతో చాలా మంది సమంత పుట్టింది కేరళలో అనే విషయం మర్చి పోయినట్లుంది..మీరైనా చెప్పండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం జరిగింది. అంతే కాకుండా ఆమె అడ్రస్ ఆమె నడవడిక ఆమె భాష ప్రతి ఒక్క విషయాన్ని కూడా కొందరు తీవ్రంగా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఆమె అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. అయినా కూడా కొందరి కామెంట్స్ శృతిమించి సమంతను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో సమంత ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: