వావ్:మరో 7 రోజుల్లో ఆది పురుష్ ట్రైలర్..!!

Divya
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కించడం జరిగింది.జూన్ 16వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది ఇప్పటికి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్నాయి. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు హీరోయిన్గా కృతి సనన్ నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి టీజర్ పోస్టర్ సాంగ్స్ తో ఈ సినిమా పైన భారీగానే పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవాలని డైరెక్టర్ అయితే గట్టిగానే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆది పురుష్ చిత్రం చుట్టూ అల్లుకున్న వివాదాల వల్ల ఈ సినిమా కొంతకాలం రిలీజ్ కి ఆలస్యంగా మారింది. అయితే ఈసారి ట్రైలర్తో ఈ సినిమాని మరొక లెవల్ కి తీసుకువెళ్లాలని డైరెక్టర్ ఓం రౌత్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని కూడా కన్ఫామ్ చేసినట్లుగా తెలుస్తోంది. మే 4వ తేదీన ఆది పురుష్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ ట్రైలర్ మూడు నిమిషాల సమయంతో ఉంటుందట. ఐ స్టాండర్డ్స్ లో నెక్స్ట్ లెవెల్ లో ఈ ట్రైలర్ ఉండబోతున్నట్లు సమాచారం.
ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా ట్రైలర్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు  పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన గత చిత్రం రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్ తర్వాత ప్రభాస్ బ్లాక్ బాస్టర్ హిట్టు కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా పైన భారీగానే ఎక్స్పెక్ట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. మరి ట్రైలర్తో ఏమాత్రం నెగెటివిటీని పూర్తిగా చెరిపేసి ఈ సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తారేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: