సాయి ధరమ్ తేజ్ కు ఇష్టమైన హీరోలు ఎవరో తెలుసా...?

murali krishna
మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ  మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయిధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన  విజయం అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా రాబడుతుంది.ఇలా ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో హీరో సాయిధరమ్ తేజ్ ఎంతో సంతోషంగా ఉన్నారు అలాగే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈయన పెద్ద ఎత్తున సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారట.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదిక గా ఈయన అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ సందడి చేశారట..ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నేటిజన్ హీరోని ప్రశ్నిస్తూ మీ క్రష్ ఎవరు అంటూ కూడా అడిగారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ సమంత తన క్రష్ అంటూ ఓపెన్ అయ్యారు. అలాగే ఈయనకు ఇష్టమైన హీరోల గురించి కూడా ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ వెల్లడించారట.. ప్రజెంట్ జనరేషన్లో తనకు పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్  మాస్ మహారాజ రవితేజ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఇండస్ట్రీ లోకి వచ్చి మెగా హీరోలు అంటే తనకు ఇష్టమని చెప్పకుండా ఈ హీరోల పేర్లు చెప్పడంతో ఈ హీరోల అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారట..ఇక సాయిధరమ్ తేజ్ కు విరూపాక్ష సినిమా ఎంతో స్పెషల్ అని అయితే చెప్పాలి ప్రమాదం తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచివిజయం అందుకున్నారు.ఈ సినిమాతో భారీ కలెక్షన్స్ కూడా సాధించారు సాయి ధరమ్ తేజ్. తేజ్ కు విరూపాక్షా సినిమా గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా విజయంతో పారితోషకం కూడా పెంచినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: