హనీ రోజ్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా...?

murali krishna
వీర సింహ రెడ్డి విడుదల అయ్యి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడ హనీ రోజ్ ప్రభావం తగ్గడం లేదు. తెలుగు ప్రేక్షకులను తన భారీ అందాలతో ఫిదా చేసింది.
ఇక తెలుగు లో ఆమె మొదటి సినిమా వీర సింహ రెడ్డి అని అందరు కూడా అనుకుంటారు కానీ 2008 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం లో శివాజీ హీరో గా నటించిన ఆలయం చిత్రంలో  మొదటి సారి హీరోయిన్ గా ఆమె నటించింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరో గా నటించిన ఈ వర్షం సాక్షిగా చిత్రంలో కూడా ఆమె ఒక పాత్రలో అయితే నటించింది.
ఇక ఇప్పుడు తెలుగు లో సాలిడ్ కం బ్యాక్ అయితే ఇచ్చింది.బాలయ్య  వీర సింహ రెడ్డి తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీ లో దాదాపు సెటిల్ అయినట్టే అని అందరు కూడా అనుకుంటున్నారు. అందరు ఊహించినట్టుగానే ఆమె ఎక్కువ హైదరాబాద్ లోనే కనిపిస్తుండటం గమనార్హం.. ఇక ఈ కేరళ చిన్నదాన్ని అందరు ముద్దుగా పొన్ను అని కూడా పిలుస్తారట. ఈమె వయసు 33 ఏళ్ళు. ఇంకా కెరీర్ లో సెటిల్ కాలేదు అనే ఒక్క రీజన్ తో పెళ్లి అయితే చేసుకోలేదు.
అయితే ఒక్కో సినిమాకు 20 లక్షలు మాత్రమే తీసుకునున్న హాని రోజ్ ఇన్నేళ్ల కెరీర్ లో పెద్దగా కూడబెట్టింది అయితే ఏమి లేదు. ఆమెకు 2 కోట్ల మేర నెట్ వర్త్ ఉండటం గమనార్హం.. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా షాప్ ఓపెనింగ్స్ చేసి బాగానే వెనుకేసింది.హాని రోజ్ ఎక్కువగా ఆమె మొదట కొన్న ఇన్నోవా కారు నే వాడుతూ ఉంటుందట.. ఇక అది మాత్రమే కాకుండా ఆమె దగ్గర నిస్సాన్ సన్నీ కారు కూడా వుందని తెలుస్తుంది.. ఇక తల్లిదండ్రుల నుంచి వచ్చిన విల్లా తో పాటు ఆమె కష్టపడి సొంతంగా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ని కూడా కొనుగోలు చేసింది. ఆమె ఎక్కువగా తన సొంత ఫ్లాట్ లోనే ఉంటుంది. తల్లిదండ్రులకు హనీ రోజ్  ఒకటే కుమార్తె. దాంతో ఆమెకు ఆర్థికంగా ఎలాంటి డోకా అయితే లేదు. కెరీర్ కూడా ఇప్పుడు తెలుగు తో పాటు సౌత్ ఇండియాలో బాగానే ఉంది..ఈ ఏడాది వీరసింహ రెడ్డి తో పాటు పూక్కాలం అనే మరొక సినిమాను లో కూడా ఆమె నటించింది. కానీ ఇంతవరకు వేరే సినిమాను ఆమె ఒప్పుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: