అవకాశాల కోసం కమిట్మెంట్ ఇస్తే తప్పేంటి అంటున్న విష్ణుప్రియ..?

Anilkumar
బుల్లితెర హాట్ యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత పోవే పోరా షోతో యాంకర్ గా ఎంట్రీ వచ్చింది. సుడిగాలి సుదీర్ తో కలిసి యాంకరింగ్ చేసి ఈ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు టీవీ షోలు చేసి యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడైతే బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు కానీ అటు చిన్న సినిమాల్లోనూ, ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తుంది. ముఖ్యంగా ఈ బోల్డ్ బ్యూటీ హీరోయిన్గా నటించాలని తెగ ఆశ పడుతోంది. అందుకే సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడానికి కూడా అస్సలు వెనకాడడం లేదు. 

ఇక సోషల్ మీడియాలో అయితే విష్ణు ప్రియకి స్టార్ హీరోయిన్లకు సమానంగా ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె హీరోయిన్లను మించి అందాలను ఆరబోస్తూ ఉంటుంది. గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందచందాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇక ఈ అమ్మడి అందాలకు సోషల్ మీడియాలో బాగానే ఫాన్స్ ఉన్నారు.ఇదిలా ఉంటె తాజాగా విష్ణు ప్రియ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్ కౌచ్ మీద స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు విష్ణు ప్రియ మాట్లాడుతూ.." సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు అందుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. అందులో భాగంగా కొన్నిసార్లు కాస్టింగ్ కౌచ్ ను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాంటి వాటికి  మనం కూడా ధైర్యంగా ఉండాలి. కొన్నిసార్లు కమిట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా సరే అసలు బాధపడకూడదు. అవకాశాల కోసం ఇలాంటి పనులు చేసే వారు కూడా ఉంటారు. అలా అని వాళ్లను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళ పరిస్థితి కాబట్టి. ప్రస్తుతానికి నేనైతే నా టాలెంట్ తోనే అవకాశాలు అందుకుంటున్నాను" అంటూ విష్ణు ప్రియా తాజా ఇంటర్వ్యూ లో పేర్కొంది. దీంతో కాస్టింగ్ కౌచ్ గురించి విష్ణు ప్రియ చేసిన ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సీరియల్ నటుడు మానస్ తో కలిసి చేసిన గంగులు అనే ఆల్బమ్ సాంగ్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇప్పటికే యూట్యూబ్లో ఈ సాంగ్ 2 మిలియన్ కి పైగా వ్యూస్ ని అందుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: