ఏలియన్ గా రాబోతున్న శివ కార్తికేయన్...!!

murali krishna
సౌత్ ఇండస్ట్రీ లో విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో రాణిస్తున్న యువ హీరో శివ కార్తీకేయన్ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనీ తెలుస్తుంది.
ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై 24ఏఎమ్ అధినేత ఆర్డీ రాజా నిర్మాణంలో ఆయలాన్ సినిమాకు ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారనీ తెలుస్తుంది.. కేజేఆర్ స్టూడియోస్ అధినేత కోటపడి జే రాజేష్ ఈ సినిమా 2023 సంవత్సరంలో దీపావళీ కానుకగా విడుదల అవుతున్నదని ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
కేజీ ష్టూడియోస్ అధినేత కేజే రాజేష్ విడుదల తేదిని ప్రకటించిన తర్వాత ఆయలాన్ సినిమా గురించిన విశేషాలు వెల్లడించారు. ఈ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో దీవాళీకి విడుదల చేస్తున్నాం. ఈ సినిమాను మనసు, హృదయం పెట్టి  ఎంతో కష్టపడి తీశాం. ఈ సినిమాను దీపావళీకి విడుదల చేస్తున్నామని తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఉన్నాం అని అన్నారు.
ఆయాలన్ మేకింగ్ విషయంలో, క్వాలిటీ విషయంలో మేము ఎలాంటి రాజీ పడలేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాలో హయ్యెస్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటిగ్రేషన్‌తో చేయబోతున్నాం. మాకు సరైన సమయం  కూడా ఉంది కాబట్టి.. మేము ఫర్‌ఫెక్ట్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతున్నాం అని కే జే రాజేష్ కూడా అన్నార.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయాలన్ చిత్రం తొలి ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ చిత్రం కాబోతుంది.. 4500 పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ అయితే ఉంటాయి. ఏలియన్ క్యారెక్టర్‌ కథాంశంగా ఉండటంతో రిచ్‌తో సినిమాను  అయితే రూపొందిస్తున్నాం. ఈ సినిమాను అత్యాధునిక సాంకేతికతతో వర్క్ చేస్తున్న ఫాంటామ్ ఎఫ్ఎక్స్ థ్యాంక్స్ చెబుతున్నాం అని కే జే రాజేష్ అన్నారు.
 అయలాన్ చిత్రం విషయానికి వస్తే.. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం కూడా తీసిపోని విధంగా సీజీ వర్క్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఎంతో వేచి చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు చాలా ధన్యవాదాలు. ఫ్యాన్స్ ఎదురుచూపులకు తగిన ప్రతిఫలం ఉంటుంది అని కే జే రాజేష్ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: