ఆ కారణంగా ఏడాది పాటు అవకాశాలు రాలేదు... పూజా హెగ్డే..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ లో తన అందచందాలతో ... నటనతో ప్రేక్షకులను బాగానే అలరించింది. దానితో పూజ హెగ్డే కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే పూజా హెగ్డే ఎన్నో మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం పూజ హెగ్డే ... రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం మూవీ లోను ... వెంకటేష్ ... వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 3 మూవీ లోను ఐటమ్ సాంగ్ లలో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలు దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించాయి.

 వరుసగా పూజా హెగ్డే నటించిన రాదే శ్యామ్ ... బీస్ట్ ... ఆచార్య ... సర్కస్ ... కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... నేను ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడక పోవడంతో ఒక ఏడాది పాటు నాకు అవకాశాలు రాలేదు. దానితో ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. మళ్లీ అవకాశాలు వస్తుండడంతో ప్రస్తుతం కెరీర్ ను ఫుల్ బిజీగా కొనసాగిస్తున్నాను అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: