చిరంజీవితో పోటీపడుతున్న యువహీరో.. సక్సెస్ అవుతారా..!!

Divya
సినీరంగం అనగానే ఒక హీరోతో మరొక హీరో సినిమాలు కచ్చితంగా పోటీ పడాల్సిందే.. ముఖ్యంగా సినిమా విడుదల తేదీ సమయంలో ఒకేరోజు ఒకే డేటు కూడా ఫిక్స్ చేసుకొని చాలామంది హీరోలు తమ సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. అలా ఇప్పటి వరకు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగ సమయంలో ఎంతోమంది హీరోలు సైతం పోటీపడి తమ సినిమాలను విడుదల చేశారు. ఎందుకంటే ఇలాంటి సమయాలలో ఎక్కువగా ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వస్తూ ఉంటారని హీరోల నమ్మకం.
ఇప్పటివరకు స్టార్ హీరోలు కూడా ఇలాంటి పోటీ పడడం జరిగింది. ఎవరైనా పెద్ద హీరోలు సినిమా ఉందంటే చిన్న హీరోలు కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ తాజాగా టాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే చిరంజీవితో హీరో సిద్దు జొన్నలగడ్డ తలబడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే చాలాకాలం గ్యాప్ తర్వాత చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి ఈ సినిమా కూడా కొత్త కథేమీ కాదు కానీ చిరంజీవినీ డైరెక్టర్ బాబి చూపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది.
దీంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి బోలా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రం 2015లో విడుదలైన తమిళ చిత్రం వేదాలం సినిమాకి రిమెక్కుగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. స్టార్ హీరో సినిమా అయ్యింది చిన్న హీరోలు సినిమాలు విడుదల చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ డీజే టిల్లు.. సిద్దు జొన్నలగడ్డ మాత్రం డీజే టిల్లు చిత్రాన్ని సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కూడా ఆగస్టు 11వ తేదీని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. మరి చిరంజీవికి పోటీగా ఈ సినిమా విడుదల చేస్తూ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: