ఆ క్రేజీ మూవీ పైన ఆశలన్నీ పెట్టుకున్న పూజ హెగ్డే..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా ఇండియన్స్ అని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు , తమిళ , హిందీ మూవీ లలో నటించి దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు పూజా హెగ్డే తన కెరియర్ లో ఎక్కువ శాతం కమర్షియల్ మూవీ లలో నటించి తన అందచందాలతో ఎక్కువ శాతం ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే తన అంద చందాలతోనే ప్రేక్షకులను ఎక్కువ శాతం కట్టిపడేసిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు , తమిళ , హిందీ పరిశ్రమలో వరుస అవకాశాలను దక్కించుకుంటుంది.

కాకపోతే ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం నుండి నటించిన దాదాపు ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే వస్తుంది. పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ మొదటగా ప్రభాస్ హీరోగా రూపొందిన రాదే శ్యామ్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఆ తరువాత బీస్ట్ అనే తమిళ మూవీలో నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఆ తర్వాత ఆచార్య మూవీలో నటించింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులు నిరాశపరిచింది. కొంతకాలం క్రితమే ఈ ముద్దుగుమ్మ సర్కస్ అనే మూవీలో నటించింది. ఈ మూవీ కూడా అపజయం అందుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" అనే మూవీలో నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇలా వరుస అపజాలతో డీలా పడిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మహేష్ హీరో గా  రూపొందుతున్న మూవీలో హీరోయిన్ నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మరి ఈ మూవీ తో పూజా హెగ్డే ఏ రేంజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: