ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చిన "ధమాకా" హిందీ వర్షన్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం మొదటగా రవితేజ  హీరో గ రూపొందిన ఖిలాడి సినిమా విడుదల అయింది. ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా ... డింపుల్ హయాతి ... మీనాక్షి చౌదరి ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తర్వాత రవితేజ ... శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లో హీరో గా నటించాడు.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తర్వాత రవితేజ పోయిన సంవత్సరం చివరన ధమాకా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తెలుగు వర్షన్ కొన్ని రోజుల క్రితం నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ జీ 5 "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చింది. మరి ఇప్పటికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ తెలుగు వర్షన్ కు ప్రేక్షకుల నుండి సూపర్ క్రేజ్ లభించింది. మరి ఈ మూవీ హిందీ వర్షన్ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: