పోన్నియన్ సెల్వన్-2 మరి ఇంత దారుణమా..?

Divya
డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న చిత్రం పోన్నియన్ సెల్వన్. ఈ చిత్రానికి సంబంధించి రెండవ భాగాన్ని ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమా మొదటి భాగం తమిళంలో తప్ప మరే భాషలలో కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చోళుల పల్లవుల గురించి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది ఒక అడ్వెంచర్ కథ గా ఈ సినిమాని చూపించిన అనుభూతి అయితే పెద్దగా కలగలేదు.

కేవలం తమిళ సంస్కృతిలో భాగంగానే ఈ సినిమాని చూపించడంతో కొంతమంది ప్రేక్షకులకు మాత్రం బాగానే కనెక్ట్ అయ్యింది.. మొదటి భాగాన్ని దిల్ రాజు తెలుగులో విడుదల చేయగా దీంతో అతనికి నష్టాలు మిగిలాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పార్ట్-2 విడుదలకు రెడీ అవుతున్న అస్సలు ఎక్కడ బస్సు లేకపోవడమే కాకుండా తమిళనాడులో మాత్రమే కొద్దిగా సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ఇందులో కేవలం అందరూ కూడా తమిళ స్టార్స్ నటిస్తూ ఉండడమే అని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా ఓవర్సీస్ లో అయితే అసలు అడ్వాన్స్ బుకింగ్ కూడా రావడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పోన్నియన్ సెల్వన్ -1 కంటే మరింత దారుణంగా ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్న ఈ సినిమాని కోలీవుడ్లో బాహుబలి, కే జి ఎఫ్ సిరీసులతో పోలుస్తూ ఉన్నారు.. అయితే ప్రస్తుతం పోన్నియన్ సెల్వన్ -2 పరిస్థితి చూస్తుంటే తమిళంలో కూడా కనీసం మొదటి భాగాన్ని మించిన కలెక్షన్లు కూడా అందుకుంటుందా లేదా అనే డౌటు కూడా అందరిలో కలుగుతోంది.ఇతర భాషలలో ఎలాగో బజ్ లేకపోయినా కనీసం తమిళంలో నైనా ఈ సినిమా నెట్టు కొస్తుందా లేదో అనే మాట వినిపిస్తున్నాయి.పోన్నియన్ సెల్వన్-1 భాగం ప్రపంచవ్యాప్తంగా రూ .300 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది. మరి రెండవ భాగమైన అందులో సగమైన చేస్తుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: