ప్రియాంక చోప్రా: బాలీవుడ్ కి యూటర్న్?

Purushottham Vinay
బాలీవుడ్ లో సిల్వర్‌ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి పెద్ద గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం హాలీవుడ్‌లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న ప్రియాంక చోప్రా ఇప్పుడు యూ టర్న్ తీసుకోని మళ్ళీ బాలీవుడ్ కి వచ్చేస్తోంది. ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ మీడియాతో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌లో పెద్ద స్టార్ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే హాలీవుడ్‌ వైపు అడుగులు వేసింది హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇక అమెరికన్ టీవీ షో అయిన క్వాంటికో కోసం ప్రియాంక చోప్రాని ఏరి కోరి మరి సెలెక్ట్ చేసుకున్నారు హాలీవుడ్ మేకర్స్‌. వెస్ట్రన్ వరల్డ్ నుంచి వచ్చిన మొదటి అవకాశాన్ని చాలా పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ హాలీవుడ్‌లో కూడా అందరిని ఆకట్టుకొని అక్కడ కూడా జెండా పాతేశారు.ప్రియాంక చోప్రాకి మొదటి షోతోనే హాలీవుడ్‌లో చాలా మంచి గుర్తింపు రావటంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ టీవీ షోతో వెస్ట్రన్‌ జర్నీ స్టార్ట్ చేసిన ప్రియాంక చోప్రా అక్కడ సూపర్ హిట్ ప్రాంచైజీల్లో కూడా నటించి హాలీవుడ్‌ టాప్ స్టార్స్‌ లిస్ట్‌లో చేరిపోవడం జరిగింది.


అయితే అక్కడ తన కెరీర్‌ సాఫీగానే ఉన్నా.. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ వైపు యూ టర్న్ తీసుకొని అడుగులు వేస్తుంది ప్రియాంక చోప్రా. ఈ హాట్ బ్యూటీ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాక ఏళ్ల తరబడి ఇండియాకు దూరంగా ఉంది. అక్కడే అమెరికాకి చెందిన సింగర్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్ళాడి సెటిల్ అయిపోయింది. అయితే ఈ మధ్య మాత్రం రెగ్యులర్‌గా ఇండియాకి వచ్చి వెళుతున్నది. టైమ్ తీసుకొని మరీ బాలీవుడ్ సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నది. దీంతో ఆమె అభిమానులు మళ్ళీ ఖుషి అవుతున్నారు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన ప్రియాంక అక్కడ నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోయింది.తన కెరీర్ పీక్స్ లో వున్నప్పుడే బాలీవుడ్ ని వదిలేసి హాలీవుడ్ కి వెళ్ళిపోయింది ప్రియాంక చోప్రా. ఇక సౌత్ విషయానికి వస్తే విజయ్ తో ఓ సినిమా రామ్ చరణ్ తో ఓ సినిమా చేసింది ప్రియాంక చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: