ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి. భారీ అంచనాలను నడుమ విడుదల అయిన కొన్ని సినిమాలకు విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలక్షన్ లను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏ మూవీ లు అందుకున్నాయో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమా విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు 10 కోట్లకు మించి కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ లని ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.
నాని హీరోగా రూపొందిన దసరా మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసింది. ధనుష్ హీరోగా రూపొందిన సార్ అనే బైలింగిల్ మూవీ కూడా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసింది. సాయి ధరంమ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష సినిమా కూడా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసింది.