సుధీర్ బాబుకు ఈసారైనా కలిసి వచ్చేనా..?

Divya
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సినీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్నవారు చాలామందే ఉన్నారు. అంతేమంది సక్సెస్ కాలేని వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కూడా ఒకరు. ఎంతో టాలెంట్ ఉండి చక్కటి ఫీజిక్ ఉన్నప్పటికీ మహేష్ బాబు వంటి సపోర్టు ఉన్న కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కెరియర్ ప్రారంభంలో నుండి ఎన్నో విభిన్నమైన సినిమాలను చేస్తూ ఉన్నప్పటికీ సుధీర్ కు రావాల్సిన గుర్తింపు మాత్రం రావడం లేదు.

సమ్మోహనం సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకున్న సుదీర్ ఆ క్రేజ్ కాపాడుకోవడానికి ప్రతి సినిమాకు తన బెస్ట్ పర్ఫామెన్స్ ను చేస్తూ ఉన్నారు. కానీ అదృష్టం కలిసి రాలేదు.. వరుసగా ప్లాపులు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది విడుదలైన హంట్ సినిమా సుధీర్ కెరియర్ లోని భారీ డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ కూడా మామ మచ్చింద్ర అనే సినిమా పైనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ కమెడియన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సుదీర్ బాబు లడ్డు బాబు లో ఉన్న లుక్కులో ఉండడంతో ఈ సినిమాపై మరింత ఉత్కంఠంగా రేపుతోంది. ఈ సినిమా టీజర్ ఈ రోజున ఉదయం విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది.కానీ తాజాగా మేకర్స్ మరొక క్రేజీ అప్డేట్ కూడా ప్రకటించారు. ఈ సినిమా టీజర్ను మహేష్ బాబు విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

దీంతో ఇప్పటివరకు సినిమాకు ఉన్న క్రేజ్ డబ్బులు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది కామెడీ యాక్షన్మేంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుధీర్ కు జోడిగా ఇషా రెబ్బ.. మృణాళిని రవి నటిస్తున్నది. మరి ఈ సినిమాతో నైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి సుధీర్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: