రామబాణం: రామబాణం లా దూసుకుపోతున్న ట్రైలర్..!!

Divya
హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం రామబాణం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో లక్ష్యం,లౌక్యం వంటి సినిమాలు విడుదలయి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చిత్ర బృందం. గోపీచంద్ కు సరైన సక్సెస్ రాక చాలా కాలం అవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలై బాగానే ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం. ట్రైలర్ను పవర్ ప్యాక్ కూడా కట్ చేయడం జరిగింది.గోపీచంద్ ఈ సినిమాలో మాస్ యాక్షన్ హీరోగా మరొకసారి కనిపించబోతున్నారు. ఇందులో జగపతిబాబు గోపీచంద్ అన్నయ్యగా కనిపించబోతున్నారు. కుష్బూ కూడా గోపీచంద్ కు వదిన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమోషన్ కంటెంట్ ఈ సినిమాలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీటికి తోడుగా కామెడీ కూడా ఉండబోతున్నట్లు ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్గా నటిస్తోంది.
అన్ని కమర్షియల్ హంగుళాలతో కలిగి ఉన్న ఈ రామబాణం ట్రైలర్ చూస్తూ ఉంటే గోపీచంద్ ఈసారి కచ్చితంగా సక్సెస్ కొట్టడం ఖాయమని పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు . రామబాణం సినిమా మే 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.మరి రామబాణం సినిమాతో గోపీచంద్ కెరియర్ అటు డైరెక్టర్ కెరియర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి. ఇందులో కమెడియన్సుగా వెన్నెల కిషోర్ ,గెటప్ శీను ,ఆలీ, సత్య తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయమైన విజువల్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: