భారీ స్థాయిలో ' స్పై ' డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ...!!

murali krishna
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండడం లేదు. ప్రేక్షకుల ఆలోచన విధానంలో చాలా మార్పు రావడం వల్ల సినిమాలో కంటెంట్ మాత్రమే చూస్తున్నారు.
కంటెంట్ ఉంటే ఎంత చిన్న సినిమాను అయిన బిగ్గెస్ట్ హిట్ గా నిలుపుతున్నారు. అదే కంటెంట్ లేకపోతే స్టార్ హీరోల సినిమాలను కూడా అట్టర్ ప్లాప్ చేస్తున్నారు.
దీంతో చిన్న హీరోలు కూడా మంచి కంటెంట్ తో వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. ఇక తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ కూడా ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.
ఈ సినిమా తర్వాత నిఖిల్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవలే క్రిస్మస్ కానుకగా వచ్చిన 18 పేజెస్ కూడా మంచి విజయం సాదించింది. ఇక వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న నిఖిల్ ఇప్పుడు కొత్త చిత్రంతో త్వరలోనే మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''స్పై'' యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.. అలాగే స్టార్ మా సాటిలైట్ హక్కులను దక్కించు కున్నట్టు సమాచారం.
ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఆర్యన్ రాజేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: