నగ్మా ను దారుణంగా అవమానించిన సీనియర్ స్టార్ హీరో....!!

murali krishna
తెలుగు సినీ రంగంలో ఆంధ్రులు అందాల నటుడు, సోగ్గాడు అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శోభన్ బాబు. కుటుంబ కథా చిత్రాలతో మహిళా ప్రేక్షకుల మనస్సు దోచుకున్నారు.
అయితే శోభన్ బాబు సెట్ లో నవ్వుతూ, నవ్విస్తుంటారని ఆయనతో పని చేసిన వ్యక్తులు చెబుతుంటారు. అయితే ఓ హీరోయిన్ విషయంలో తీవ్ర అసహనానికి గురై.. ఆమెను అవమానించారట. సినీ రంగ ప్రపంచంలో ఒకప్పడి అగ్ర నటుల్లో ఒకరు శోభన్ బాబు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ సమయంలో 'ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు'సినిమా రిలీజ్ అవుతుందంటూ ప్రచారం చేసేవారు.
రింగుల జుట్టుతో మహిళాభిమానుల మనస్సులను 'చోర్' చేశాడాయన. ఇద్దరు భార్యలుండే కుటుంబ కథా చిత్రాల హీరో అనగానే శోభన్ బాబే గుర్తుకు వచ్చేవారు అప్పటి దర్శక నిర్మాతలకు. నట భూషణుడు, సోగ్గాడు వంటివి ఆయనకు అభిమానులు ఇచ్చిన బిరుదులు. షూటింగ్ సమయాల్లో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఆయనకు.. కోపం అరుదుగా వచ్చేదట. ఇక వస్తే.. ఇట్టే తగ్గేది కాదట. ఓ హీరోయిన్ విషయంలో కూడా ఆయన సీరియస్ అయ్యి.. ఆమెపై విరుచుకు పడ్డారట.
 
ఇంతకు శోభన్ బాబు కోపానికి కారణమైన ఆ హీరోయిన్ ఎవరంటే ప్రముఖ నటి (Nagma) నగ్మా. హిందీ సినిమా నుండి తెలుగులోకి వచ్చి పెద్దింటి అల్లుడు, కిల్లర్, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సమయంలో శోభన్ బాబుతో కలిసి అడవి దొర అనే సినిమాలో నటించింది. అందులో మరో హీరోయిన్‌గా సురభి నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సాంగ్ చిత్రీకరణ కోసం చైనా సరిహద్దుకు సమీపంలో చిత్ర యూనిట్ వెళ్లింది.
 
అయితే అందరూ వచ్చారు కానీ నగ్మా మాత్రం రాలేదట. అయితే ఆమె కోసం శోభన్ బాబు చాలా సేపు వెయిట్ చేశారట. గంటన్నర ఆలస్యంగా షూటింగ్ స్పాట్‌కు రావడమే కాకుండా.. తలతిక్క సమాధానాలు చెప్పడంతో శోభన్ బాబుకు ఒక్కసారిగా చిర్రెత్తుకు వచ్చిందట. నగ్మాను శోభన్ బాబు పిలిచి.. నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది అని అడిగారట. దానికి నగ్మా సమాధానం ఇవ్వగా.. 'నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి టైమ్ సెన్స్ ఉండాలి' అంటూ సీరియస్ అయ్యారట. శోభన్ బాబు ఇచ్చిన వార్నింగ్ తో నగ్మా నోట మాట రాలేదట. ఆ తర్వాత శోభన్ బాబు బ్యాగ్రౌండ్ తెలిసి నగ్మా నోరెళ్లబెట్టిందట. దాంతో తన తప్పు తెలుసుకొని పశ్చత్తాపపడిందట. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే శోభన్ బాబు ఆదా చేయడం మొదలు పెట్టారు. భూమిపై ఎన్నో పెట్టుబుడులు పెట్టారు. వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: