బ్లాక్ ట్రెండీ వేర్లో రెచ్చిపోయిన సమంత అందాలు..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇటీవలే విడుదలైన శాకుంతలం సినిమా విడుదలై పెద్దగా ప్రేక్షకులను ఆకట్టు కోలేద అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత ఎక్కువగా సమయాన్ని కేటాయించింది. ఇప్పుడు తాజాగా సమంత ఇంగ్లాండ్ కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ సీటడేల్ ప్రీమియర్ షో ప్రదర్శన జరుగుతూ ఉండగా అక్కడ హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడు టీం రాజ్ అండ్ డీకే హీరో వరుణ్ ధావన్ లతో సమంత ఈవెంట్లో పాల్గొనడం జరిగింది.

ఇండియన్ వర్షన్ లో సమంత ఇందులో నటిస్తోంది. సమంత నటిస్తున్న సిటడెల్ సిరీస్ చిత్రీకరణ దశలో ఉండగా ప్రీమియర్ ఈవెంట్ కి సమంత చాలా స్టైలిష్ గా అందరిని అట్రాక్ట్ చేసే విధంగా తయారయింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ డిజైనర్ ధరించి తన అందాలతో ఈ ఫోటోలను వైరల్ గా చేస్తోంది..
దేశం మారగానే సమంత వేషం మార్చారని మరి కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శాకుంతలం  సినిమా ప్రమోషన్స్లో వైట్ వస్త్రధారాలు నిర్వహించి చీరకట్టు లో జపమాల ధరించి సాదాసీదాగా కనిపించిన సమంత ఈ లుక్కులో చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

బ్లాక్ దుస్తులను స్టైలిష్ గా ఫోజులు ఇస్తూ తన అందాలను ఆరబోస్తూ కనిపిస్తోంది సమంత. ముఖ్యంగా ఆమె లుక్కు అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో శివ దర్శకత్వంలో వచ్చిన మజిలీ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన. ప్రస్తుతం సమంత ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: