ఏజెంట్: అఖిల్ కూడా KGF ని కాపీ కొడుతున్నాడా?

Purushottham Vinay
సీనియర్ స్టైలిష్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన స్పై యాక్షన్‌ ఫిల్మ్‌ 'ఏజెంట్‌'. మలయాళం లెజెండరి హీరో మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కొత్త అమ్మాయి సాక్షివైద్య హీరోయిన్‌గా నటించింది.ఏప్రిల్‌ 28 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృంది. ట్రైలర్ మొత్తం కూడా యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది.'నువ్వెందుకు ఏజెంట్‌ అవ్వాలనుకుంటున్నావు'అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. ఇక కోతిలాంటి బిహేవియర్‌ ఉన్న అఖిల్‌ ఏజెంట్‌గా మారతాడు. అయితే ఒకానొక దశలో అఖిల్‌నే చంపేయాలని మమ్ముట్టి ఏకంగా తన టీమ్‌ సభ్యులను ఆదేశిస్తాడు.అయితే అసలు మమ్ముట్టి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అలాగే ఆ మిషన్‌ని పూర్తి చేసే క్రమంలో అఖిల్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? లాస్ట్ కి ఆ మిషన్‌ ఎలా సక్సెస్‌ అయింది? అనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్‌ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది.అయితే ఇలాంటి యాక్షన్‌ మూవీ అఖిల్‌కి కొత్త కానీ ఆడియన్స్‌కి కాదు.


గతంలో వచ్చిన స్పై యాక్షన్‌ ఫిల్మ్స్‌ లాగే ఇందులో కూడా గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించడం, అదిరిపోయే స్టంట్స్‌ అనేవి ఉన్నాయి. ఇక కేజీయఫ్‌ తర్వాత పెద్ద గన్‌తో క్లైమాక్స్‌ని సెట్‌ చేయడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. విక్రమ్‌ నుంచి మొన్నటి పఠాన్‌ సినిమా వరకు ప్రతి యాక్షన్‌ సినిమాలో పెద్ద గన్‌తో బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏజెంట్ ట్రైలర్ చివర్లో కూడా ఇలాంటి సీన్ ని ఒకటి పెట్టారు.అయితే ఈ సినిమా కోసం అక్కినేని అఖిల్ చాలా కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌ హాప్‌ తమిళ్‌ పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా ఈ ట్రైలర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ చాలా ఆకట్టుకుంది. ఈ సినిమాకు చాలా భారీగానే ఖర్చు చేసినట్లు ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద అఖిల్‌ ఈ సినిమాతో పెద్ద సాహసమే చేశాడు. అది ఏ మేరకు వర్కౌట్‌ అవుతుందనేది ఏప్రిల్‌ 28 వ తేదీన సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.మరి చూడాలి ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి హిట్ ని ఇస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: