స్టైలిష్ లుక్ లో మైమరపిస్తున్న యంగ్ బ్యూటీ..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ బిజియేస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరో గా హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
 

అలాగే రామ్ పోతినేని హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లోను హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లతో పాటు నితిన్ హీరో గా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లోను హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. వీటితో పాటు మరి కొన్ని సినిమా లలో కూడా ఈ ముద్దు గుమ్మ నటిస్తోంది. శ్రీ లీల ప్రస్తుతం నటిస్తున్న మూవీ లలో ఎక్కువ శాతం మూవీ లపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇలా ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ లీల తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ కోట్ ను ధరించి అదిరిపోయే స్టైలిష్ లో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: