పవన్ సినిమాకు జెడి చక్రవర్తి స్పూర్తి !

Seetha Sailaja
రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జెడి చక్రవర్తి హీరోగా దర్శకుడుగా అనేకప్రయోగాలు చేసినప్పటికీ ఆప్రయోగాలలో పూర్తిగా సక్సస్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఇంచుమించు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే గతంలో ఒక సినిమా విషయంలో అతడు చేసిన ప్రమోగం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు స్పూర్తిగా మారే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో మాటలు వినిపిస్తున్నాయి.

పవన్ సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘వినోదయ సితం’ తెలుగు రీమేక్ షూటింగ్ ఇంచుమించు పూర్తి అయింది త్వరలో పవన్ సాయి ధరమ్ తేజ్ శ్రీలీల పై ఒక మాస్ సాంగ్ ని తీయబోతున్నారు. ఈపాట చిత్రీకరణతో ఈమూవీ షూటింగ్ ఇంచుమించు పూర్తి అవుతుంది అంటున్నారు. జూలైలో విడుదలకాబోతున్న ఈమూవీ టైటిల్ కు సంబంధించి అనేక టైటిల్స్ బయటకు లీక్ అయ్యాయి.

పవన్ సాయి ధరమ్ తేజ్ లను కలుపుతూ ఒక టైటిల్ ఉంటే బాగుంటుందని భావించి ఈమూవీ నిర్మాతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇప్పటికే ఈమూవీకి సంబంధించి కొన్ని టైటిల్స్ బయటకు లీక్ అయ్యాయి. ‘దేవర’ ‘దేవుడు’ అన్న టైటిల్స్ పరిశీలనలో ఉన్నప్పటికీ ఆటైటిల్స్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం అధికారికంగా ప్రకటింపబడలేదు. ఇలాంటి పరిస్థితులలో ఈసినిమాకు సంబంధించిన ఒక నిర్మాత ఒకమీడియాకు సంబంధించిన ప్రతినిధితో మాట్లాడుతూ తమ మూవీకి టైటిల్ లేకుండా విడుదల చేసి ఆతరువాత ప్రేక్షకులను ఈమూవీ టైటిల్ ఏది పెడితే బాగుంటుందో చెప్పమని దైరెక్ట గా పవన్ అభిమానులకు తెలియచేయమని అడుగుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఇలాంటి ప్రయోగం ఒక సాహసం. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి ఆలోచనలు జేడీ చక్రవర్తికి రావడంతో అప్పట్లో అతడు ఒకప్పటి క్రేజీ హీరోయిన్ మీనాతో కలిసి అతడు నటించిన మూవీని టైటిల్ లేకుండా విడుదల చేసి ఆతరువాత ఆమూవీకి ‘పాపే నా ప్రాణం’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. ఇప్పుడు అలాంటి ప్రయోగం పవన్ సాయి ధరమ్ మూవీ విషయంలో ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది అన్నఆలోచనలు ఈమూవీ నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఈమూవీని టైటిల్ లేకుండా విడుదలచేసి ఆతరువాత ఈసినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం టైటిల్ పెడతారట అన్న వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: