నాని 30.. టైటిల్ ఏంటో తెలుసా..?

shami
దసరా హిట్ తో కెరీర్ బెస్ట్ రిజల్ట్ అందుకున్న నాని తన నెక్స్ట్ సినిమాతో మరో కొత్త కథతో వస్తున్నాడు. నాని ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. దసరా లో కూడా తన ధరణి పాత్రతో ఆడియన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు నాని. ఇక నాని 30వ సినిమా నూతన దర్శకుడు శౌర్యువ్ తో చేస్తున్నాడు. అతను చెప్పిన కథ విని నాని వెంటనే సినిమాకు ఓకే చేశాడు. అయితే సినిమా ఎనౌన్స్ మెంట్ రోజే నాని ఈ కథ ఎలా ఉండబోతుందో చెప్పాడు.
నాని ఈ సినిమాలో మరోసారి తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ జెర్సీ సినిమాలో నాని అలాంటి రోల్ ప్లే చేశాడు. ఇక సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె కూడా సినిమాలో మరో హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. నాని 30వ సినిమా సెంటిమెంట్, ఎమోషన్ రెండు సమపాళ్లలో ఉంటాయట. ఇక ఈ సినిమా టైటిల్ గా హాయ్ నాన్నా అని పెడుతున్నారట. అలా ఎందుకు అంటే ఈ సినిమా కథలో భార్యా భర్తలు ఇద్దరు విడిపోదామని అనుకుంటారట. అయితే వారి పాప వారి వల్ల ఎంత సఫర్ అయ్యింది అన్నది సినిమా కథ అని తెలుస్తుంది.
సినిమా కథ చాలామందికి టచ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ తరం ప్రేమ పెళ్లలో అప్పటివరకు బాగానే ఉన్నా పెళ్లి తర్వాత తమకు ఒక బిడ్డ ఉన్నా సరే విడాకులు తీసుకుంటున్నారు. ఆ టైం లో వారి కడుపున పుట్టిన వారి సంతానం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఇదే కథతో నాని 30 వస్తుంది. సినిమా టైటిల్ హాయ్ నాన్నా అన్నది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మరి సినిమా టైటిల్ గా అది అవుతుందా కాదా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: