బాలయ్య డైరెక్టర్ తో తలపతి విజయ్ సినిమా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్నటువంటి దర్శకులలో ఒకరు అయిన గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ హీరోగా శ్రేయ హీరోయిన్ గా రూపొందినటు వంటి డాన్ శీను మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన ఈయన ఆ తర్వాత ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న మాస్ దర్శకుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు బాలకృష్ణ హీరోగా రూపొందినటువంటి వీర సింహా రెడ్డి అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... వరలక్ష్మీ శరత్ కుమార్ ... దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. ఈ సినిమాను మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వీర సింహా రెడ్డి మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న గోపీచంద్ మలినేని తన తదుపరి మూవీ ని తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న తలపతి విజయ్ తో చేయబోతున్నట్లు ... ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ ... లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: