సలార్ నుంచి లీకైనా అదిరిపోయే మాస్ డైలాగ్...!!

murali krishna
పాన్ ఇండియా హీరో గా ప్రభాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రభాస్  ముందు సినిమా రాధే శ్యామ్ సినిమా ప్లాప్ అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ కొంచం ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో లో ఆయన ఎపిసోడ్ టెలికాస్ట్ అయినపుడు ఒక్కసారి గా ఆహా క్రాష్ అయింది దీన్ని బట్టి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో తెలుస్తుంది..ప్రస్తుతం ప్రభాస్ మారుతీ డైరెక్షన్ లో రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరా వేగంగా జరుగుతుంది అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్  డైరెక్షన్ లో చేస్తున్న సాలార్ సినిమా షూట్ ప్రభాస్ పాల్గొంటారని సమాచారం.ఆల్రెడీ ఈ సినిమా మూడు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
ప్రశాంత్ నీల్ అంటేనే ఎలివేషన్స్ తో సినిమా చేసే స్టార్ డైరెక్టర్ ఒక హీరోని జనానికి నచ్చినట్టుగా ఎలా చూపించాలో చాలా బాగా తెలిసిన డైరెక్టర్...ఇది ఇలా ఉంటె రీసెంట్ గా నెట్ లో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది సలార్ సినిమా నుంచి ఒక డైలాగ్ లీకైందని అది మంచి మాస్ డైలాగ్ ఏంటంటే...ప్రభాస్ తో రౌడీ నీ జనం నా కాళ్ళ కింద ఉంది,నీ బలం నా గుప్పట్లో ఉంది అని అంటే అప్పుడు ప్రభాస్ నా జనం,నా బలం ఎక్కడున్నా నీ ప్రాణం మాత్రం నా చేతిలో ఉన్న కత్తి లోనే ఉంది...అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడట ఇదే డైలాగ్ ఇప్పుడు చాలా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందనీ తెలుస్తుంది.డైలాగ్ అదిరిపోయేలా ఉంది అంటూ ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హల్చల్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా మీద ఎక్సపెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి.ఈ సినిమాతో మళ్లీ ప్రభాస్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అని ఆయన ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: