విడుదల1: బ్రహ్మరథం పడుతున్న తెలుగు ప్రేక్షకులు?

Purushottham Vinay
టాలెంటెడ్ తమిళ దర్శకుడు వెట్రి మారన్ ఆడుకలం, విసరనై, వడ చెన్నై ఇంకా అసురన్ వంటి చిత్రాలతో సూపర్ గుర్తింపు పొందారు. అతను ఇప్పుడు తన కొత్త సినిమా విడుతలై పార్ట్ 1తో మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకోడానికి తిరిగి వచ్చాడు.కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా పేరు పొందిన సూరి మరియు కోలీవుడ్ స్టార్ హీరో ప్రయోగాత్మక పాత్రలు చెయ్యడంలో స్పెషలిస్ట్ అయిన విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ గ్రిటీ-పోలీస్ డ్రామా తమిళంలో కొన్ని వారాల క్రితం విడుదలైంది.ఇక విడుదలైన తర్వాత, విడుదలకి ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక తమిళనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లని రాబట్టింది. నిర్మాతలు ఈ సినిమాని తెలుగులో విడుదల పార్ట్ 1 పేరుతో డబ్ చేశారు. తెలుగు వెర్షన్ ఏప్రిల్ 15న విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకొని బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు తీస్తుంది.


ఇక ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, విడుదల సినిమా  విడుదలైన తొలిరోజే ఏకంగా 1.5 కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. పెద్ద హీరో లేకపోయినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి డీసెంట్ వసూళ్ళని రాబట్టింది.రెండో రోజూ కూడా ఈ సినిమా దాదాపు కోటిపైగా వసూళ్లు చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఇక మూడోరోజు అనగా ఈరోజు కూడా ఈ సినిమా చాలా మంచి వసూళ్ళని రాబట్టినట్లు సమాచారం తెలుస్తుంది.కథ బాగుంటే మంచి సినిమాలు రిలీజ్ అయితే భాష బేధం లేకుండా హిట్ చేస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఈ సినిమా హిట్ తో తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ పేరు మరో సారి మారుమొగిపోతుంది.ఇక స్టార్ కమెడియన్‌గా ఇన్నాళ్లు నవ్వించిన సూరి.. ఇందులో పోలీస్ డ్రైవర్గా.. సీరియస్ రోల్ ని చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కుమరేశన్‌ పాత్రలో సూరి బాగా జీవించేశాడు. ఇంకా దానికి తోడు పెరమాళ్ క్యారెక్టర్‌లో స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ఎప్పటిలాగే అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: