బాలకృష్ణ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఎన్బికె 108 మూవీ యూనిట్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మధ్య వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలకృష్ణ ఆ తర్వాత వీర సింహా రెడ్డి మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా వరుసగా రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ చిత్ర బృందం "ఎన్ బి కే 108" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

vఈ సినిమా విడుదల దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క షూటింగ్ ను హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో రూపొందిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న షూటింగ్ లో బాలకృష్ణ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ పై ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ చిత్ర బృందం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: