నితిన్ ... వక్కంతం వంశీ లేటెస్ట్ మూవీ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
జయం మూవీ తో హీరో గా తన కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఆఖరుగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందినటువంటి మాచర్ల నియోజకవర్గం అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ లో కృతి శెట్టి ... క్యాథరిన్ హీరోయిన్ లుగా నటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తో దర్శకుడి గా కెరీర్ ను మొదలు పెట్టిన వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

హైదరాబాద్ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని ఆఫీస్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సైతాన్ అనే టైటిల్ మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు ఒక వార్త కొన్ని రోజుల క్రితం అయింది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: