ప్రతిరోజు భోజనంలో.. అది ఉండాల్సిందే : కీర్తి సురేష్

praveen
సాదరణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే టాలెంట్ ఎంత ముఖ్యమో ఇక ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో అయితే ఇలా ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నటీనటులు కనిపిస్తున్నారు. ఇక తమకు కావాల్సిన ఆహారాన్ని తినకుండా కేవలం డైట్ ఫాలో అవుతూ ఎప్పుడూ నాజూగ్గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక హీరోలు అయితే సిక్స్ ప్యాక్ లు మెయింటైన్ చేస్తూ ఉంటే.. హీరోయిన్లు జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు.

 ఇలా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఇక ప్రేక్షకులను తమ అందం అభినయంతో ఆకర్షిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా తమ అందం అభినయంతో ఆకట్టుకుంటున్న వారిలో అటు కీర్తి సురేష్ కూడా ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ హిట్లను సాధిస్తుంది కీర్తి సురేష్. ఇప్పటికే ప్రతి పాత్రకు కూడా ప్రాణం పోస్తూ నేటితరం ప్రేక్షకులకు మహానటి గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల నానీ హీరోగా వచ్చిన దసరా సినిమాలో కూడా నటించింది. ఇకపోతే ఇటీవల తాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఆహార నియమాలను చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.

 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన డైట్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఉదయం లేవగానే గ్లాస్ పాలలో తేనె కలుపుకొని తాగుతాను. రోజంతా నీళ్లు పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటాను. నాన్ వెజ్ అంటే నాకు ఇష్టమే. కానీ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఇక వెజ్ డైట్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. ఇక ప్రతిరోజు భోజనంలో చివర్లో చారు ఉండాల్సిందే. చారుతో ముద్ద తింటే ఇక చివరికి భోజనం పూర్తయినట్లు సంతృప్తి కలుగుతుంది అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: