గౌరవ డాక్టరేట్ పొందిన సింగర్ మనో...!!

murali krishna
గత 38 ఏళ్ల నుంచి తెలుగు తో పాటు 15 భాషల్లో మనో పాటలు పాడుతున్నారు. అలాంటి ఈ సీనియర్ గాయకుడికి అరుదైన గౌరవం దక్కింది.సింగర్ మనో గాయకుడి గా మాత్రమే కాకుండా డబ్బిగ్ ఆర్టిస్ట్ గా అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా రాణించారు.
38 ఏళ్ల నుంచి సంగీతాని కి ఆయన అందిస్తున్న సేవలని గుర్తించిన రిచ్ మాండ్ గాబ్రియేల్ యూనివర్సిటీ డాక్టరేట్ తో సత్కరించిందట.
ఈ విషయాన్ని మనో సోషల్ మీడియా లో ప్రకటిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మనో15 భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఇది తన కెరీర్ దక్కిన గౌరవం గా భావిస్తున్నానని మనో కూడా అన్నారు. నాకు మద్దతు తెలిపిన వారికి, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికి కూడా ధన్యవాదాలు అని మనో తెలిపారు.
డాక్టరేట్ అందుకున్న తర్వాత మనో ఆ ఫోటోని అభిమానులతో పంచుకున్నారట . మనో స్వస్థలం సత్తెనపల్లి. 14 ఏళ్ల వయసులో నే సంగీతంపై మక్కువ తో అప్పటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథ్ వద్ద అసిస్టెంట్ గా కూడా చేరారు. 1985 నుంచి మనో తెలుగు తో పాటు అన్ని భాషలకు పాటలు పాడడం ఆయన ప్రారంభించారు.
రుకు రుకు రుక్మిణి, ప్రియా ప్రియతమా రాగాలు, ముక్కలా ముక్కబులా లాంటి సూపర్ హిట్స్ సాంగ్స్ ను ఆయన ఎన్నో పాడారు. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మనో.. అరుణాచలం, ముత్తు, నరసింహ, శివాజీ మరియు రోబో లాంటి చిత్రాలకు రజనీకాంత్ కి తెలుగులో డబ్బింగ్ అందించారు. కమల్ హాసన్ , అక్షయ్ కుమార్ లాంటి హీరోల కు కూడా మనో డబ్బింగ్ అందించారట.ఇక బుల్లితెర పై కూడా అనేక సింగింగ్ షోలకు మనో జడ్జి గా కూడా చేశారు. ఇక జబర్దస్త్ లాంటి షో లో కూడా ఆయనజడ్జి గా చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: