నిన్నటితో ముగిసిన "ఉస్తాద్ భగత్ సింగ్" మొదటి షెడ్యూల్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ రూపొందబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ మూవీ ని మైత్రి మూవీ సంస్థ నిర్మిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ లీల ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటించబోపోతుంది.

 కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీ లీల కూడా జాయిన్ అయింది. ఇది ఇలా ఉంటే నిన్నటి తో ఈ మూవీ కి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ లో పవన్ మరియు శ్రీ లీల పై చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

దానితో ఈ మూవీ మొదటి షెడ్యూల్ లో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక పోలీస్ స్టేషన్ సెట్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యూనిట్ మొదటి షెడ్యూల్ లో చిత్రీకరించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ను మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇది వరకు పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తమిళ సూపర్ హిట్ సినిమా అయినటు వంటి తేరీ మూవీ కి రీమేక్ గా రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: