రాజా డీలక్స్ ప్రభాస్ లుక్ ఎలా వుందో తెలుసా..?

murali krishna
ప్రభాస్ ఆది పురుష్తో పాటు నాలుగు చిత్రాలు చేస్తున్నాడు.. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ ను జరుపుకుంటుంది.జూన్ నెలలో విడుదల కానుందని తెలుస్తుంది.. ప్రాజెక్ట్ కే, సలార్ మరియు రాజా డీలక్స్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వీటిలో ఆదిపురుష్ మూవీ మీద అసలు అంచనాలు అయితే లేవు. కనీసం ఫ్యాన్స్ కూడా ఆ మూవీ కోసం ఎదురుచూడటం లేదని తెలుస్తుంది.. టీజర్ చూసి వాళ్ళు ఓ నిర్ణయానికి అయితే వచ్చేశారు. దానికి తోడు వివాదాలు ఆ ప్రాజెక్ట్ మీద హైప్ పోయేలా చేశాయి. ఆదిపురుష్ రూపంలో ప్రభాస్ మరో ప్లాప్ చూడబోతున్నాడని పలువురి చర్చించుకుంటున్నారు.

ఆదిపురుష్ తో పాటు రాజా డీలక్స్ మీద కూడా అస్సలు అంచనాలు లేవు. నిజానికి ఈ ప్రాజెక్ట్ వద్దని ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో అలాగే రాధే శ్యామ్ చిత్రాలు తెరకెక్కించిన సుజీత్, రాధాకృష్ణలకు అస్సలు అనుభవం లేదు. అందుకే ప్రభాస్ వంటి టాప్ స్టార్ ని సరిగా ప్రజెంట్ చేయలేకపోయారనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో దర్శకుడు మారుతికి ఆఫర్ ఇవ్వడం అవసరమా అని అంటున్నారు.

మారుతి ఇంతవరకు ఒక్క స్టార్ హీరోతో కూడా మూవీ చేయలేదు. అలాగే ఆయన ట్రాక్ కూడా అంతగా బాగోలేదు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి అలాగే పక్కా కమర్షియల్ ప్లాప్ అయ్యాయి. మారుతి ప్రాజెక్ట్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు.ప్రభాస్ ఇంట్రెస్ట్ ఏమిటో తెలియదు కానీ… మారుతికి అయితే ఆఫర్ ఇచ్చారు. రాజా డీలక్స్ షూటింగ్ కూడా మొదలైపోయిందట..


రాజా డీలక్స్ షూటింగ్ దాదాపు సెట్స్ లో నే పూర్తి చేయనున్నారట. అనూహ్యంగా ఇది కామెడీ హారర్ మూవీ అంటున్నారని సమాచారం.. ఈ జోనర్ ప్రభాస్ కి ఎలా సెట్ అవుతుందనే ఓ వాదన కూడా ఉంది. కాగా రాజా డీలక్స్ మూవీకి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో ప్రభాస్ లుక్ కొంచెం భిన్నంగా ఉందని తెలుస్తుంది.. బాగా గడ్డం అలాగే జుట్టు పెంచుకుని ఉన్నాడు. ప్రభాస్ పక్కన హీరోయిన్ రిద్దీ కుమార్ కూడా ఉంది. అంత పెద్ద స్టార్ పక్కన రిద్దీ కుమార్ ఏంటని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారట.నిధి అగర్వాల్ అలాగే మాళవిక మోహనన్ మరో ఇద్దరు హీరోయిన్స్ అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: