ఆది పురుష్ తరువాతే ఇక ఏదైన: ప్రభాస్

Purushottham Vinay
పాన్ ఇండియా రెబల్ స్టార్  ప్రభాస్  హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్  హీరోయిన్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ '' ఆదిపురుష్ ''. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుంది. ఈ సినిమాపై ముందు నుండి భారీగా అంచనాలు పెరిగాయి.ఇది రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మొదటి హిందీ సినిమా కావడంతో మన తెలుగు ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూసారు.అయితే ఆదిపురుష్ సినిమా నుండి మేకర్స్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ చేసారో అప్పటి నుండి ఈ సినిమాపై ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కు సైతం ఈ సినిమా టీజర్ పెద్దగా నచ్చలేదు.. ఇక ఈ ట్రోల్స్ దెబ్బకు ఈ సినిమాను జనవరి నెల నుండి జూన్ 16 వ తేదీకు వాయిదా వేశారు. మళ్ళీ గ్రాఫిక్స్ పనులను స్టార్ట్ చేసి అభిమానులను మెప్పించే విధంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తున్నారు.


మరి విడుదలకు మరికొద్ది సమయమే ఉంది.. దీంతో ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా మాత్రమే కాదు ప్రభాస్ నటిస్తున్న మిగిలిన సినిమాల నుండి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మొదటి ప్రాముఖ్యత ఆదిపురుష్ సినిమాకే ఇచ్చాడని సమాచారం తెలుస్తుంది.. ఈ సినిమా రిలీజ్ అయ్యే దాకా మరో సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకూడదు అని ప్రభాస్ ప్లాన్ చేసుకున్నాడట. ఈ సినిమా నుండి మాత్రమే అప్డేట్స్ వస్తే అందరి ఫోకస్ ఆదిపురుష్ మీదనే ఉంటుందని ప్రభాస్ ప్లాన్.. మరి ప్రభాస్ ప్లాన్ బాగానే ఉన్న ఆదిపురుష్ మేకర్స్ మాత్రం అభిమానులను ఎప్పటికప్పుడు నిరాశ పరుస్తున్నారు. ఇంకా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎలాంటి స్పీడ్ కనిపించక పోవడం ప్రభాస్ అభిమానులను చాలా అసహనానికి గురి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: