అవకాశాలు కావాలంటే వాటి సైజు పెంచుకోమన్నారు.. రాధిక ఆప్టే బోల్డ్ కామెంట్స్..!!

Divya
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా హీరోయిన్ రాధిక ఆప్టే సుపరిచితమే.. ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదానికి తెర లేపుతూ ఉంటుంది ఈ అమ్మడు. ఇక తను మొదట రక్త చరిత్ర అనే సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యింది.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంది. ఈ మధ్య సౌత్ హీరోల పైన పెను సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇదిలా వుండగా తాజాగా ఒక విదేశీ సినిమా కోసం పూర్తిగా న్యూడ్ గా నటించి ఆ వీడియోలు లీక్ అవడంతో వార్తల్లో నిలిచిన రాధిక ఆప్టే ఇప్పుడు మరొకసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.

ఈసారి తన కెరీర్ లో ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి తెలియజేసింది. సినిమాలలో ఆఫర్లు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒక్కొక్కరు ఒక విధంగా.. తనతో మాట్లాడేవారని ఆవేదనను తెలియజేస్తోంది రాధిక. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా రాధిక ఆప్టే మాట్లాడుతూ.. నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవాలి అంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలి.. ఖచ్చితంగా శరీరంలో పలుమార్పులు రావాల్సిందే అన్నారంటూ తెలియజేస్తోంది. ముఖ్యంగా తన ముక్కు షేప్ మార్చుకోవడంతోపాటు తన ఎద యొక్క సైజు పెంచుకోవాలంటూ కొంతమంది దర్శకనిర్మాతలు సలహాలు ఇచ్చారట.

అయితే ఇవన్నీ మార్చుకుంటేనే ఇండస్ట్రీలో నెట్టుకు రాగలరని తెలియజేశారట. ఆ సమయంలో తన పైన తనకి అప నమ్మకం ఏర్పడిందని కానీ ఆ తర్వాత నేను అవగాహన పెంచుకొని తనకు ఉన్న అందంతోనే అవకాశాలను అందుకునేలా చేసుకున్నానని తెలియజేసింది.  కెరియర్ ప్రారంభంలో కొంతమంది వ్యవహరించిన తీరును బట్టి తను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలనేంత కోపం వచ్చిందంటూ రాధిక ఆప్టే తెలియజేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: