ప్రభాస్ తో దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

Anilkumar
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్తో సినిమా చేయాలని ఎంతోమంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో కొంతమంది నిర్మాతలు ఇప్పటికే ప్రభాస్ కి అడ్వాన్సులు ఇచ్చి డేట్స్ కూడా తీసుకున్నారు. మరి కొంతమంది ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అయితే ఈ లిస్టులో మన టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఉన్నారు. మొన్న ఫ్యాన్స్ తో నిర్వహించిన చాటింగ్ సెషన్ లో ప్రభాస్ తో ఓ సినిమా ఉంటుందని స్వయంగా దిల్ రాజు తెలిపారు. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జటాయు' గురించి కూడా చెప్పుకొచ్చాడు. 

అయితే తాజాగా దిల్ రాజు డ్రీం ప్రాజెక్ట్ జటాయు గురించి కొన్ని వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో దిల్ రాజు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ప్రభాస్ తోనే చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. కానీ అప్పుడు ఎందుకనో కుదరలేదు. అయితే ఇప్పుడు మాత్రం ప్రభాస్ తోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టు ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నట్లుగా సినీ వర్గాల్లోసరికొత్త బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ ఆల్రెడీ లాక్ అయిందని, అంతేకాకుండా ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు.

అయితే ప్రస్తుతానికి అటు ప్రభాస్ ఇటు ప్రశాంత్ నీల్ కమిట్ అయిన ప్రాజెక్టు నుంచి ఫ్రీ అయ్యాక దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్టు జటాయు సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ ఓ మైథాలజికల్ బ్యాక్ డ్రాప్ తో ఉంటుందట. ఈ ప్రాజెక్టు కోసం భారీ కాస్ట్ ని కూడా తీసుకోబోతున్నారట. బహుశా 2025లో ఈ ప్రాజెక్టు పట్టాలకే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక స్వయంగా దిల్ రాజు ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబో మూవీ సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ నుంచి టీజర్ రాబోతోంది. హోం బలే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: