"ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ షూటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న అందాల ముద్దు గుమ్మ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ధమాకా మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ప్రస్తుతం అనేక క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్నటు వంటి మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రామ్ బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.
 

బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని మూవీ లకు కూడా ఈ ముద్దు గుమ్మ క్రీం సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా పవన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ మూవీ లో కూడా ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా ఎంపిక అయింది .

ఇది ఇలా ఉంటే నిన్నటి నుండి ఈ మూవీ షూటింగ్ లో ఈ ముద్దు గుమ్మ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ ముద్దు గుమ్మకు బొకేను ఇస్తూ  షూటింగ్ లోకి ఈ చిత్ర బృందం ఎంట్రీ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: