పీపుల్స్ మీడియాతో బన్నీ భారీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాణ సంస్థల్లో మంచి సక్సెస్ రేట్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇటీవల మీడియం రేంజ్ హీరో నుంచి స్టార్ హీరోలతో సినిమాలు  నిర్మిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరో సంచలన దిశగా అడుగులు వేస్తోంది. లేటెస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ భారీ ప్రాజెక్టు నిర్వించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కార్తికేయ 2, ధమాకా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఈ నిర్మాణ సంస్థ టాప్ ప్రొడక్షన్ హౌస్ గా కొనసాగుతోంది. ఇక ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బన్నీకి ఓ సర్ప్రైజ్ నీ ప్లాన్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. 

ఏకంగా ఆకాశంలో 'హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్' అనే ఓ బ్యానర్ను చిన్న విమానానికి తగిలించి బన్నీకి అదిరిపోయే రేంజ్ లో బర్త్డే విషెస్ ను అందించారు. అలా ఆకాశంలో చెక్కర్లు కొట్టిన విమానం హ్యాపీ బర్త్డే బన్నీ అనే బ్యానర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక అలా బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పడానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చయిందట. ఇప్పటివరకు ఏ ప్రొడక్షన్ హౌస్ ఓ అగ్ర హీరోకి ఇంత మొత్తంలో ఖర్చు పెట్టి బర్త్డే విషెస్ ను చెప్పలేదు. అలాంటిది అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా ఐదు లక్షలు ఖర్చుపెట్టి మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు బన్నీ కి బర్త్ డే విషెస్ చెప్పడంతో త్వరలోనే అల్లు అర్జున్తో ఈ నిర్మాణ సంస్థ ఓ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించే ఆలోచనలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఒకవేళ బన్నీతో సినిమా కనుక కన్ఫర్మ్ అయితే కచ్చితంగా ఈ ప్రాజెక్టు తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఇండస్ట్రీలో మరింత హైట్స్ కి చేరే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప2 ఉండబోతుందని ఇటీవల టీజర్ ద్వారానే నిరూపించారు మేకర్స్. పుష్ప 2 టీజర్ వచ్చాక సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇక ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక పుష్ప 2 తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు బన్నీ. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో బన్నీ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: