బంఫర్ ఆఫర్ అందుకున్న జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ తో పాటూ మరో ఇద్దరు స్టార్ హీరోలతో రొమాన్స్..?

Anilkumar
బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ నటించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకొని టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కనుక హిట్ అయితే టాలీవుడ్ లో జాన్వి కపూర్ కి తిరుగుండదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించే బంపర్ ఆఫర్ ని పట్టేసింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. 

తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ అగ్ర హీరోలైన రామ్ చరణ్, మహేష్ బాబు లతో జాన్వి కపూర్ రొమాన్స్ చేనుందట. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ సినిమాలో ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్గా తీసుకుందామని రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుకి చెప్పారంట. ఈ క్రమంలోనే బుచ్చిబాబు జాన్వి కపూర్ దగ్గరికి వెళ్లి కథను చెప్పినట్లు బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కథ కూడా జాన్వి కపూర్ కు నచ్చిందని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.

ఇక మరోవైపు దర్శక దిగజం ఎస్ ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్టు తెరకెక్కనుంది. ఈ సినిమాలో కూడా జాన్వి కపూర్ను హీరోయిన్గా తీసుకోవాలని మూవీ యూనిట్ అనుకుంటున్నారట. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్ లో కనుక జాహ్నవి కపూర్ హీరోయిన్గా ఓకే అయితే ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆమెకు తిరుగుండదని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో నటిస్తున్న సినిమాలో జాహ్నవి కపూర్ క్యారెక్టర్ నీ చాలా స్పెషల్ గా డిజైన్ చేశారంట కొరటాల శివ. ఇక ఈ సినిమా కోసం జాన్వి కపూర్ ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో మొదటి సినిమాకి ఈ రేంజ్ లో జాన్వీ కపూర్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: