"యూఎస్ఏ" లో ఆరేర్ మార్క్ కలెక్షన్లను టచ్ చేసిన నాని "దసరా" మూవీ..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన దసరా మూవీ ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ... తమిళ ... కన్నడ ... మలయాళ ... హిందీ భాషలలో భారీ అంచనాల నడుమ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి "యు ఎస్ ఏ" లో కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇప్పటికే "యూ ఎస్ ఏ" లో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ "యూ ఎస్ ఏ" లో ఒక రేర్ మార్క్ కలెక్షన్ లను టచ్ చేసింది. తాజాగా ఈ మూవీ "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికీ కూడా ఈ మూవీ కి "యూ ఎస్ ఏ" లో స్టడీ గా కలెక్షన్ లు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... మహానటి కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లోని నాని మరియు కీర్తి సురేష్ నటనకు గాను వీరిద్దరికీ ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: