ఈరోజు నుంచి పవన్ మూవీలో జాయిన్ కానున్న శ్రీ లీల..!

Pulgam Srinivas
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా రూపొందిన పెళ్లి సందD మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ... ఆ తర్వాత రవితేజ హీరో గా రూపొందిన ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న శ్రీ లీల గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కేవలం రెండే తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం మాత్రం అనేక తెలుగు మూవీ లలో నటిస్తోంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం అనేక క్రేజీ మూవీ లలో హీరోయిన్ గా నటిస్తోంది.

అలా శ్రీ లీల ఇప్పటికే అనేక క్రేజీ మూవీ లలో హీరోయిన్ గా నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ రేస్ లో ముందు వరుసలో దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. ఈ మూవీ లో పవన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతుంది. ఈ మూవీ షూటింగ్ లో పవన్ ఇప్పటికే జాయిన్ అయ్యాడు. పవన్ పై కొన్ని సన్నివేశాలను కూడా ఈ మూవీ యూనిట్ చిత్రీకరించింది.

ఇది ఇలా ఉంటే ఈ రోజు నుండి ఈ మూవీ షూటింగ్ లో శ్రీ లీల కూడా జాయిన్ కాబోతోంది. ఈ మూవీ యూనిట్ ఈ రోజు నుండి శ్రీ లీల కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: