మహేష్ మూవీలో ప్రభాస్ హీరోయిన్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... పూజా హెగ్డే ... శ్రీ లీల ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ ... రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

ఈ మూవీ మహేష్ కెరియర్ లో 29 వ మూవీ గా రూపొందబోతుంది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాక ముందే ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ని ప్రేక్షకులకు అంచనాలకు తగినట్టు గానే అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత అద్భుతంగా తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా ఈ మూవీ లో మహేష్ సరసన హీరోయిన్ గా నటించబోయే ముద్దు గుమ్మ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తుంది.

అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ మూవీ లో మహేష్ తన జాన్వి కపూర్ హీరోయిన్ గ నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ లో మహేష్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకు శ్రద్ధ ... ప్రభాస్ హీరోగా రూపొందినటువంటి సాహో అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: