"రావణాసుర" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుదీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ లభించింది.

దానితో ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన డిజిటల్ హక్కులను ఈ చిత్ర బృందం ఒక ప్రముఖ సంస్థకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఈ మూవీ బృందం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కు భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన సాటిలైట్ హక్కులను కూడా ఇప్పటికే అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే ఈ సినిమా యొక్క సాటిలైట్ హక్కులను ప్రముఖ సాటిలైట్ సంస్థలలో ఒకటి అయినటు వంటి జీ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ ని కొన్ని వారాల థియేటర్ రన్ ను ముగిసిన తర్వాత "ఓ టి టి" లో విడుదల చేయనున్నట్లు ... "ఓ టి టి" లో కూడా కొన్ని వారాలు స్ట్రీమింగ్ అయిన తర్వాత ఈ మూవీ ని జీ సంస్థ ... జీ తెలుగు చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: