అనుపమ పరమేశ్వరన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు హిట్స్ సినిమాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్. కెరియర్ స్టార్టింగ్ లో వరుస సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఇప్పటికే సౌత్ సినీ ఇండస్ట్రీలో డిఫరెంట్ రోల్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్న ఈ బ్యూటీ గత ఏడాది ఏకంగా రెండు హిట్స్ ని అందుకుంది. అందులో ఒకటి పాన్ ఇండియా హిట్ కావడం విశేషం. గత ఏడాది అనుపమ నిఖిల్ సరసన నటించిన కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి. అలాగే వీటితో పాటు బటర్ఫ్లై అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా నటించింది. ఈ మూవీ ఓ టి టి లో రిలీజ్ అయింది. 

కేవలం నటిగానే కాకుండా తనలో మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కూడా ఉందని తాజాగా ప్రూవ్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల 'ఐ మిస్ యు' అనే షార్ట్ ఫిలిమ్ తో డిఓపిగా మారింది అనుపమ పరమేశ్వరన్? సంకల్ప్ గోర దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలిం ను చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేయగా.. ఈ షార్ట్ ఫిలిం లో అనుపమ కెమెరా వర్క్ కి అత్యద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ లో నివసిస్తున్న ఓ యువకుడు.. అతని తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ ఈ షార్ట్ ఫిలిం స్టోరీ ఉంటుంది. ఇక ఈ షార్ట్ ఫిలిం కి అనుపమ ఫోటోగ్రఫీ మెయిన్ ఎసెట్ గా నిలిచింది. ఈ షార్ట్ ఫిలిం నీ youtube లో చూసిన ఆడియన్స్ అనుపమ పరమేశ్వరన్ ఫోటోగ్రఫీని తెగ మెచ్చుకుంటున్నారు.

ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు తనలోని టాలెంట్ ని సందర్భం వచ్చినప్పుడల్లా బయట పడుతుంది అనుపమ. ఇక హీరోయిన్ గానే కాకుండా ఇప్పుడు డిఓపి గా కూడా అనుపమకి విమర్శకుల నుండి ప్రశంసలు రావడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ కృషి అవుతున్నారు. ఇక ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా అనుపమ ఈ షార్ట్ ఫిలిం కి వర్క్ చేయడం ఇదే మొదటిసారి. మొదటి అటెంప్ట్ లోనే అనుపమ ఇంత మంచి ఔట్పుట్ ఇవ్వడం విశేషం అనే చెప్పాలి. ఇక ఇటీవల కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిన అనుపమ ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇక ఇటీవల బటర్ఫ్లై అనే క్రైమ్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల లోను నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: