గేమ్ ఛేంజర్‌ సినిమా.. రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ కావాల్సిందేనా..?

Divya
కెరటం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కూడా ఒక వెలుగు వెలిగింది. ఇక తమిళంలో కూడా భారీగానే సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ అమ్మడు బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టి అక్కడే సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. చివరిగా ఈమె కొండ పొలం అనే సినిమాలో నటించింది.

కానీ ఈ సినిమా  కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. నటుడు శివ కార్తికేయన్ తో ఈమె అయలాన్ అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.కరోనా, లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యింది అన్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా ఇప్పుడు దీపావళి కానుకగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ శంకర్ కమలహాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు-2 చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్‌ సినిమా కూడా వచ్చే ఏడాది జనవరిలోని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు.

కానీ ఇప్పుడు భారతీయుడు-2 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతూ ఉండడంతో గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా పోస్ట్ పోన్ ఉంటుందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు. రామ్ చరణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని శంకర్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది.. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: