"శాకుంతలం" మూవీ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకొని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ కెరీర్ ను కొనసాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాల్లో కూడా నటించి ఫుల్ క్రేజ్ ను తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా సంపాదించుకుంది.

కొంతకాలం క్రితం సమంత "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2" అనే హిందీ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంత కు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "శాకుంతలం" అనే మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దేవ్ మోహన్  హీరోగా నటించాడు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని 2 గంటల 22 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు చిత్ర బృందం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని 2D మరియు 3D వర్షన్ లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: