3 రోజుల్లో "రావణాసుర" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందినటు వంటి రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ మూవీ లో రవితేజ సరసన అను ఇమాన్యుయల్ , దాక్షా
 నాగర్కర్ , మెఘ ఆకాష్ , పూజిత పన్నోడా ,  ఫరియ అబ్దుల్లా హీరోయిన్ లుగా నటించగా ... సుశాంత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా నుండి ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై ప్రేక్షకులకు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.95 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.85 కోట్ల షేర్ ... 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.13 కోట్ల షేర్ ... 4 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 9.93 కోట్ల షేర్ ... 17.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇలా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: