వైరల్ అవుతున్న "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ లోని పవన్ లేటెస్ట్ పిక్స్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితమే తమిళ సినిమా అయినటు వంటి వినోదయ సీతం కు రీమేక్ గా రూపొందిన సినిమా షూటింగ్ ను మొదలు పెట్టి ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ భాగాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా ... సముద్ర ఖని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
 

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే పవన్ ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించ బోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరి కొంత మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ షూటింగ్ ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

 ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో పవన్ లుంగీ కట్టుకొని ... కాకి కలర్ లో ఉన్న షర్టును ధరించి స్టైలిష్ లోకి నడుస్తూ వెళుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: