రవితేజ "రావణాసుర" మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దాక్షా నాగర్కర్ , అన్నూ ఇమాన్యుయల్ ,  ఫరియా అబ్దుల్లా ,  మేఘ ఆకాష్  ,  పూజిత పోన్నాడా ఈ ఐదుగురు ముద్దు గుమ్మలు ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. సుదీర్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు మంచి ఓపెనింగ్ లు  వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 1.64 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ లో 70 లక్షలు , యూ ఏ లో 61 లక్షలు , ఈస్ట్ లో 30 లక్షలు , వేస్ట్ లో 21 లక్షలు ,  గుంటూరు లో 45 లక్షలు ,  కృష్ణ లో 23 లక్షలు ,  నెల్లూరు లో 15 లక్షలు ,  కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 28 లక్షలు ,  ఓవర్ సీస్ లో 38 లక్షల కలెక్షన్ లు ఈ మూవీ కి మొదటి రోజు దక్కాయి. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి మొదటి రోజు 4.95 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: