పుష్ప2 : టీజర్ లోనే కథ మొత్తం చెప్పేసారుగా..?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పుష్ప 2 టీజర్ అదిరిపోయింది. అభిమానుల అంచనాలకు మించి పుష్ప 2 టీజర్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టీజర్ లో హీరోయిజం, సస్పెన్స్, ఎలివేషన్స్ ఏమాత్రం తగ్గలేదు. ఫ్యాన్స్ కోరుకున్న ప్రతి ఎలిమెంట్ టీజర్ లో చూపించారు. తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఏమైపోయాడు? అనే సస్పెన్స్ తో మొదలుపెట్టి టీజర్ ఎండింగ్ లో గూస్ బంప్స్ తెప్పించేలా బన్నీ ఇంట్రో ని చూపించారు. పుష్పను చూసి పులి కూడా వెనకడుగు వేస్తుందనే ఉరమాస్ డైలాగ్, చివర్లో బన్నీ ఇది పుష్ప రూల్ అని చెప్పడం ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చింది. 

మామూలుగా టీజర్ అంటే ఒక నిమిషం నుండి ఒకటిన్నర నిమిషం లోపు ఉంటుంది. ఇక అదే ట్రైలర్ అయితే రెండు నిమిషాలకు పైన ఉంటుంది. కానీ వీటికి భిన్నంగా పుష్ప 2 టీజర్ ను మూడు నిమిషాలకు పైగా కట్ చేశారు. అయితే దీని వెనక సుకుమార్ మాస్టర్ ప్లాన్ కనిపిస్తుంది. ఈ మూడు నిమిషాలకు పైగా ఉన్న టీజర్ లోనే పుష్ప2 కథపై ఓ హింట్ ఇచ్చేశాడు సుకుమార్. పుష్పరాజ్ ఒక ఎర్రచందనం స్మగ్లర్. చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలకు, అణిచివేతకు గురవుతాడు. ఎలాగైనా ఎదిగి వాటికి బదులు తీర్చుకోవాలని అనుకుంటాడు. పార్ట్ 1 లో కేవలం డబ్బు మోజుతో నేరాలు చేసే స్మగ్లర్ గా పుష్ప రాజ్ ను చూపించారు.

ఎంత నెగటివ్ షేడ్స్ ఉండే రోల్ అయినా మన తెలుగు సినిమాల్లో ఉండే హీరోలలో ఎంతో కొంత మంచితనం చూపించాల్సిందే.ఇప్పుడు పుష్ప 2 లో అదే చూపించాడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లర్ గా ఎదిగాక కోట్లు సంపాదిస్తాడు. ఆ సంపాదించిన డబ్బంతా పేదలకు పంచి పెడతాడు. అదే ఇప్పుడు పుష్ప 2 లో మెయిన్ పాయింట్. ఇక పుష్ప జైలుకు ఎందుకు వెళ్ళాడు? అతని ఇరికించింది ఎవరు? చివరికి ఒక క్రిమినల్ లైఫ్ ఎలా ఎండ్ అయింది ?అనే అంశాలనే పుష్ప 2 లో చూపించబోతున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టడం ఖాయం.ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: