జూనియర్ కు అదృష్టంగా మారిన విజయదేవరకొండ పరాజయం !

Seetha Sailaja
హృతిక్ రోషన్ ఎన్టీఆర్ లు కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ చేయబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా లీక్ చేసిన న్యూస్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి హృతిక్ జూనియర్ లు కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తారని అదికూడ ‘వార్’ మూవీకి సీక్వెల్ గా వస్తుందని ఎవరూ ఊహించుకోలేదు.
 
 
బాలీవుడ్ లో కలక్షన్స్ సునామి సృష్టించగల స్టామినా హృతిక్ రోషన్ కు ఉంది. అయితే ఇప్పుడు హృతిక్ జూనియర్ స్టామినా కూడ జత కలిస్తే కలక్షన్స్ ఏస్థాయిలో ఉంటాయి అన్నది అంచనాలకు కూడ అందడంలేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ జూనియర్ కు ఏర్పడటంతో ఈ ‘వార్ 2’ మూవీలో తారక్ కు అవకాశం వచ్చిందని అంచనాలు వస్తున్నాయి.
 
 
అయితే ఈ సీక్వెల్ లో జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందుగా ఈమూవీ నిర్మాతల ఆలోచనలలో విజయ్ దేవరకొండ ఉన్నాడట. అయితే విజయ్ మొట్టమొదటి బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘లైగర్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఈమూవీ నిర్మాతల ఆలోచనలు పూర్తిగా మారిపోయి ‘ఆర్ ఆర్ ఆర్’ తో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న తారక్ పై ఈమూవీ నిర్మాతల దృష్టి పడటం ఈమూవీకి జూనియర్ అంగీకారం లభించడం అన్నీ వేగంగా జరిగిపోయాయి అని అంటారు.
 
 
వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలక కంటే ముందుగా రామ్ చరణ్ బాలీవుడ్ లో తన ఇమేజ్ ని పెంచుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన పిఆర్ టీమ్ ను ఏర్పాటు చేసుకుని బాలీవుడ్ నిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షించడానికి చాల వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అని అంటారు. అయితే ఈవిషయంలో తారక్ తన బాలీవుడ్ ప్రమోషన్ పై పెద్దగా శ్రద్దపెట్టిన సందర్భాలు తక్కువగానే కనిపిస్తాయి. అయితే బాలీవుడ్ దృష్టి మాత్రం జూనియర్ పై మల్లడమే కాకుండా ఏకంగా హృతిక్ రోషన్ తో సినిమా చేసే అవకాశం పొందడం ఒక విధంగా తారక్ అదృష్టం..  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: